పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన దాసరి ఉష.
జనం వాయిస్, పెద్దపల్లి:
పెద్దపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి సోదరుడు రఘనందన్ రెడ్డి అనారోగ్య కారణంగా చనిపోయారు.

విషయం తెలుసుకున్న వెంటనే పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష కాసులపల్లి గ్రామానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి, పూల మాల వేసి నివాళులు అర్పించి వారికి తమ ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మేరుగు సాగర్, బీసీ జేఏసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ అలువాలా రాజేందర్, ఆముదలా అరుణ, శ్రావణ్, హానీ తదితరులు పాల్గొన్నారు.