janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 8:53 pm Digital Edition : GATTU MAHESH

దోపిడి  దొంగల ముఠా అరెస్టు…రిమాండ్

దోపిడి  దొంగల ముఠా అరెస్టు…రిమాండ్

-దోపిడి కేసును చేదించిన సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులు.

-వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డిసిపి కరుణాకర్.

జనం వాయిస్,సుల్తానాబాద్, పెద్దపల్లి :

పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో దోపిడికి పాల్పడిన నలుగురు సభ్యులు గల దోపిడి ముఠాను సుల్తానాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి  115.4 గ్రాముల బంగారం, 472 గ్రాముల వెండి, పదివేల రూపాయల నగదు, రెండు కార్లు,ఒక బైకు,హ్యాండ్ కఫస్, పోలీసు లోగోలు కలిగిన స్వెటర్స్, గ్లౌసులు, ఫేక్ నెంబర్ ప్లేట్ స్వాధీనం చేసుకున్నారు. దోపిడికి  కారకులైన సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన నాగుల కుమారస్వామి, కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన తిప్పరి రవీందర్ అలియాస్ గౌరుపాటి రవీందర్, సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని శాస్త్రినగర్ కు చెందిన పురుషోత్తం నాగరాజు, కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన పోవరీ శ్యామ్ రావు లను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో డీసీపీ కరుణాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాగుల కుమారస్వామి అనే నిందితుడు గత 18 సంవత్సరాల క్రితం చాలా దొంగతనాలు చేసి జైలుకు పోయి వచ్చాడని, అతను చర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు అతనికి తిప్పారపు రవీందర్ మరియు పోవరీ శ్యామ్ రావు అను వారితో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయంతో జైలు నుండి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కలుసుకునేవారని తెలిపారు. అలా కలుసుకునే సమయంలో కుమారస్వామికి పురుషోత్తం నాగరాజు అనే వ్యక్తి మిగిలిన వారి ద్వారా  పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల క్రితం వారందరూ కలిసి సుల్తానాబాద్ లో మద్యం తాగేటప్పుడు నాగరాజుకు అతని ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేసి అప్పులు బాగా అయ్యాయని వారితో చెప్పాడు. అలాగే రవీందర్, శ్యామ్ రావులు కూడా మాకు కూడా అప్పులు అయ్యాయని చెప్పగా.. కుమారస్వామి ఎవరి ఇంట్లో కైనా వెళ్లి మేము పోలీసులమని చెప్పి దొంగ సొమ్ము  రికవరీ గురించి వచ్చాము అని బెదిరించి వారి నుండి బంగారం,డబ్బులు దోచుకుందామని వీరికి చెప్పగా, గర్రెపల్లి గ్రామంలో మా బంధువైన రమేష్ కి ఆరు నెలలకు క్రితం వివాహమైందని అతని వద్ద కచ్చితంగా బంగారం ఉంటుందని అదే అనువైన ఇల్లు అని నాగరాజు మిగతా వారికి సలహా ఇచ్చాడు. అనుకున్న ప్రకారం పక్క ప్రాణాలతో కుమారస్వామి ఆన్లైన్లో బేడీలు కొనుగోలు చేసి పోలీసులు అని నమ్మించడానికి కావలసిన దుస్తులు కరీంనగర్ లోని ఓ షాపుకు వెళ్లి అక్కడ కాకి కలర్ లో ఉండే స్వెటర్స్,పోలీసు లోగో మరియు ఆఫీసర్స్ పెట్టుకునే స్టార్ లను కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. అనుకున్న ప్రకారం నవంబర్ పదవ తేదీ తెల్లవారుజామున 4.15 నిమిషాల సమయంలో నాగరాజుకు బంధువైన రమేష్ ఇంటికి వెళ్లి మేము కరీంనగర్ వన్ టౌన్ పోలీసులమని, రమేష్ తన ఓనరు ఇచ్చిన దొంగ నోట్లు ఇంట్లో దాచాడాన్ని సమాచారంతో వచ్చామని చెప్పగా రమేష్ వాళ్ళ అమ్మ డోరు తీసింది. ఇంట్లోకి వెళ్లిన వెంటనే రమేష్ రెండు చేతులకు బేడీలు వేసి, బీరువాలో ఉన్న బంగారం కలిగిన బ్యాగును మరియు పైసలను లాక్కొని వారు వెంట తెచ్చిన కారులో పారిపోయారు. అనుమానం వచ్చిన రమేష్ తల్లి సంకరి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్రమత్తమైన  సుల్తానాబాద్ సర్కిల్ పోలీసులు సిఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి వెతుకుతుండగా ఆ నలుగురు నిందితులు జైలో కారులో దొంగలించిన బంగారాన్ని కరీంనగర్ కి అమ్ముకోవడానికి వెళుతుండగా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి  శివారులో వాహనాలు తనిఖీ లు చేస్తుండగా నిందితులను పట్టుకున్నారు. దోపిడి దొంగల ముఠాను పట్టుకోవడంలో కృషిచేసిన సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్, జూలపల్లి ఎస్సై సనత్ రెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్ మరియు పోలీస్ సిబ్బందిని డిసిపి కరుణాకర్ మరియు ఏసీపి గజ్జి కృష్ణ అభినందించి రివార్డు అందజేశారు.