సహారా ఎడారిలో మృత్యు ఘోష.
నీళ్లు లేక 49మంది మృత్యువాత.
జనం వాయిస్, సహారా,జూన్ 6:
పశ్చిమాఫ్రికాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. సహారా ఎడారిలో తాగేందుకు నీరు దొరక్క దాహంతో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు ఆగిపోవడంతో వీరంతా కొన్ని రోజుల పాటు ఎడారిలో నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. నైజర్ దేశంలో ఈ దిగ్భాoతికర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నైజర్‌కు చెందిన కొంతమంది తమ బంధువులతో పండుగ చేసుకునేకుందుకు పక్కనే ఉన్న మాలి దేశానికి ట్రక్కులో బయల్దేరారు. ఆ వేడుక ముగించుకొని తిరిగివస్తుండగా.. వీరు ప్రయాణిస్తున్న ట్రక్కు అసమాకా అనే సరిహద్దు ప్రాంతానికి 80 కిలోవిÖటర్ల దూరంలో ఆగిపోయింది. అయితే, ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో సాయం చేసేవారు దొరకలేదు. డైవర్‌తో పాటు అందులోని ప్రయాణికులు ట్రక్కును మరమ్మతు చేసేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో వారంతా కొన్ని రోజుల పాటు ఎడారిలోనే ఉండాల్సి వచ్చింది. అప్పటికే వారి వద్ద ఉన్న నీటి నిల్వలు నిండుకున్నాయి. ఎడారిలో నీటి జాడ లేకపోవడంతో వారు దాహంతో అల్లాడిపోయారు.
చివరకు ఇద్దరు వ్యక్తులు దాదాపు 50 కిలోమీటర్లకు పైగా కాలినడకన వెళ్లి నీరు తాగి అక్కడినుంచి అసమాకా పట్టణానికి చేరుకున్నారు. అక్కడ అధికారులను కలిసి విషయం చెప్పారు. అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకోగా.. హృదయ విదారక దృశ్యాలు కన్పించాయి. ట్రక్కు చుట్టూ డజన్ల కొద్దీ మృతదేహాలు కన్పించాయని అధికారులు తెలిపారు. విపరీతమైన వేడి, ఉక్కపోత, నీరు లేక 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. అయితే, ట్రక్కు ఆగిపోవడానికి కారణమేంటీ, వీరు ఎడారిలో ఎన్ని రోజులు చిక్కుకుపోయారన్న దానిపై స్పష్టత లేదు. సాధారణంగా ఈ ఎడారి జోన్ విందుగా పౌరులు రాకపోకలు సాగించడం చాలా అరుదని స్థానిక అధికారులు వెల్లడించారు. ఎక్కువ ఆఫ్రికా దేశాల నుంచి యÖరప్‌కు వలసవెళ్లేవారు ఈ మార్గాన్ని ఆశ్రయిస్తారని తెలిపారు. గతంలోనూ అనేక మంది ఇసుక వేడి,
దాహం, ఆకలితో ఈ మార్గంలో ప్రాణాలు విడిచినట్లు గుర్తుచేసుకున్నారు.