తగ్గుతున్న పక్షుల సంఖ్య.

తగ్గుతున్న పక్షుల సంఖ్య.ప్రకృతిలో మారుతున్న సమతుల్యం.నగరీకరణతో కనుమరుగవుతున్న పక్షులు.వాతావరణ మార్పుల తీవ్ర ప్రభావం.ప్రకృతి భవిష్యత్తుకు హెచ్చరిక సంకేతాలు.జనం వాయిస్, డెస్క్, మే 26: ఒకప్పుడు ఉదయం వేళల్లో పక్షుల కిలకిలరావాలతో కళకళలాడిన గ్రామాలు, పట్టణాలు ఇప్పుడు నిశ్శబ్దంగా మారుతున్నాయి. ఇంటి ముంగిట కనిపించే గువ్వలు, పొలాల్లో తిరిగే కొంగలు, చెట్లపై గూళ్లు కట్టే పక్షుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండటం పర్యావరణ నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. వేగంగా పెరుగుతున్న నగరీకరణ, చెట్ల నరికివేత, చెరువుల మాయం, రసాయనాల అధిక వినియోగం కారణంగా పక్షుల సహజ నివాసాలు...