ఆలోచనల మార్పు దిశగా “మైండ్‌సెట్ షిఫ్ట్”.-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆలోచనల మార్పు దిశగా “మైండ్‌సెట్ షిఫ్ట్”.-పుస్తక రచయిత శరాణి పొంగూరును అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.జనం వాయిస్,హైదరాబాద్,అక్టోబర్ 31:జీవితాన్ని సానుకూల దిశగా మలిచే ఆలోచనలను ప్రేరేపించే “మైండ్‌సెట్ షిఫ్ట్” (Mindset Shift) పుస్తకాన్ని రచించిన శరాణి పొంగూరును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రచయిత శరాణి పొంగూరు పవన్ కళ్యాణ్‌ను కలసి పుస్తక ప్రతిని అందజేశారు.“మైండ్‌సెట్ షిఫ్ట్” పుస్తకం ద్వారా రచయిత కృతజ్ఞత, స్వీయ అవగాహన, సానుకూల అలవాట్లు, ఆత్మవిశ్వాసం వంటి అంశాలను పాఠకుల్లో నాటడం...