janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 1:01 pm Digital Edition : JANAM VOICE

కొండగట్టు లో భక్తుల ఆందోళన.

కొండగట్టు లో భక్తుల ఆందోళన.

జనం వాయిస్, జగిత్యాల:

హనుమాన్ జయంతి రోజున కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు  ఆందోళనకు దిగారు.  గురువారం రాత్రి భక్తులు నిరసనకు దిగారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచిచూస్తున్న భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకుండా పోయింది. ప్రసాదం అడిగితే సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని భక్తులు ఆరోపించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలం అయ్యారని ఆరోపించారు.