janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 4:27 pm Digital Edition : JANAM VOICE

ధర్మారం మోడల్ స్కూల్ విద్యార్థినులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక.

ధర్మారం మోడల్ స్కూల్ విద్యార్థినులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక.

జనం వాయిస్, ధర్మారం, జూలై 17:

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన విద్యార్థినులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. పదో తరగతి విద్యార్థిని ఎన్. సంధ్య, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినులు ఎస్. రితిక, ఏ. హర్షిని జిల్లాస్థాయి మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ పరుగు పందెం పోటీల్లో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 18న మెదక్ జిల్లా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. విద్యార్థినుల ఎంపిక పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ ఈరవేణి రాజ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు బైకని కొమురయ్య, మేకల సంజీవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.