janamvoice.com
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 2:56 pm Digital Edition : JANAM VOICE

పవన్ కళ్యాణ్ వీరాభిమాని జన్యు పరమైన వ్యాధితో మృతి.!

పవన్ కళ్యాణ్ వీరాభిమాని జన్యు పరమైన వ్యాధితో మృతి.!

జనం వాయిస్, హన్మకొండ జిల్లా:జులై 08:

హన్మకొండకు చెందిన పవన్ కళ్యాణ్ వీరాభి మాని నిరంజన్(17) మరణం పట్టణంలో తీవ్ర విషాదం నింపింది అరుదైన జన్యుపర మైన వ్యాధితో చిన్న ప్పటి నుంచే పోరాడు తున్న నిరంజన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను ఒక్కసారి కలవాలన్న కోరికను ఇటీవల నెరవేర్చుకు న్నాడు 

గత కొంతకాలంగా అరుదైన జన్యు సంబంధిత వ్యాధి, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న నిరంజన్.. ఆరోగ్యం మరింత క్షీణించడంతో హనుమకొండలోని హనుమాన్ నగర్‌లోని తన నివాసంలో ఈరోజు ఉదయం కన్నుమూశాడు.వ్యాధి కారణంగా చిన్న వయ సు నుంచే మంచానికే పరిమితమైన నిరంజ న్‌ను స్థానికులు, కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగాచోటా గబ్బర్ సింగ్’ అని పిలుచుకునేవారు

శారీరక వైకల్యం ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అంటే అతనికి విపరీతమైన అభిమానం. తన అభిమాన హీరోను జీవితంలో ఒక్కసారై నా చూడాలనేది నిరంజన్ చివరి కోరిక. ఈ విషయాన్ని రాధా మనోహర్ దాస్ సహా.. పలువురు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.తన అభిమాని పరిస్థితిని తెలుసుకుని చలించి పోయిన పవన్ కళ్యాణ్..

గత నెల హనుమ కొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. మంచానికే పరిమిత మైన నిరంజన్ పక్కన కూర్చుని అతడిని ఆత్మీయంగా హత్తుకు ని ధైర్యం చెప్పారు. నిరంజన్ గతంలో తన సినిమాల పాటలకు మంచం పైనే పడుకుని వేసిన డాన్స్ వీడియో లను చూసి ఎంతో మురిసిపోయారు. ఇద్దరం కలిసి OG-2 సినిమా చూద్దామని.. అందుకోసం ప్రత్యేకం గా సినిమా స్పెషల్ షో వేయిస్తానని పవన్ మాట ఇచ్చారు.

ఈ సందర్భంగా నిరంజన్ కుటుంబా నికి పవన్ కల్యాణ్ రూ. 1 లక్ష నగదు సాయాన్ని అందిం చారు. అంతేకాకుండా, నిరంజన్ డైరీలో ‘విత్ లవ్ టు డియర్ నిరంజన్’ అని ఒక హృదయపూర్వకమైన సందేశాన్ని రాసి అతనికి చిరస్మరణీయ మైన బహుమతిగా ఇచ్చారు.