రామగుండంలో తాగునీటి సరఫరాకు అంతరాయం.
మిషన్ భగీరథ పంప్‌హౌస్ వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కారణం.
ఒక రోజు ఆలస్యంగా నీటి సరఫరా.. ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి.
జనం వాయిస్, రామగుండం, అక్టోబర్ 22:
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు నగర పాలక సంస్థ కమిషనర్ తెలిపారు. మిషన్ భగీరథ ముర్మూర్ పంప్‌హౌస్ వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా ఆలస్యమవుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం నీటి సరఫరా జరగాల్సిన ప్రాంతాలకు శుక్రవారం, శుక్రవారం సరఫరా జరగాల్సిన ప్రాంతాలకు శనివారం నీటిని అందించనున్నట్లు వివరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా నీటి పంపిణీ షెడ్యూల్‌ను ఒక రోజు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించి అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, నీటిని వృథా చేయకుండా నగర పాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.