janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 December 2025, 12:03 pm Digital Edition : GATTU MAHESH

వైద్యులు మందుల చీటీలపై రాసే రాత అర్థం కావడం లేదా?.. ఇకపై ఆ ఇబ్బంది లేదు..!

వైద్యులు మందుల చీటీలపై రాసే రాత అర్థం కావడం లేదా?.. ఇకపై ఆ ఇబ్బంది లేదు..!

-వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై జాతీయ వైద్య కమిషన్ కీలక ఆదేశాలు.

-చేతిరాత స్పష్టంగా, అర్థమయ్యేలా ఉండాలని సూచన.

-పర్యవేక్షణకు ప్రత్యేక సబ్-కమిటీ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు.

-జనరిక్ పేర్లతోనే మందులు రాయడం తప్పనిసరి.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లు (మందుల చీటీలు) స్పష్టంగా, చదవడానికి వీలుగా ఉండాలని జాతీయ వైద్య కమిషన్ (NMC) స్పష్టం చేసింది. ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రతి వైద్య కళాశాలలో ఒక ప్రత్యేక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.స్పష్టమైన ప్రిస్క్రిప్షన్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ఆరోగ్య హక్కులో అంతర్భాగమని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఎన్ఎంసీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి మెడికల్ కాలేజీలోని డ్రగ్స్ అండ్ థెరప్యూటిక్స్ కమిటీ (డీటీసీ) కింద ఒక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీ ప్రిస్క్రిప్షన్లను క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. వై