మత్తు ఇంజెక్షన్ల కలకలం..హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్ల అరెస్ట్.

మత్తు ఇంజెక్షన్ల కలకలం..హైదరాబాద్‌లో ఇద్దరు డాక్టర్ల అరెస్ట్. -అక్రమంగా అనస్తీషియా ఇంజెక్షన్ల విక్రయం బహిర్గతం.-మోతాదు మించి మత్తు ఇచ్చినందువల్ల ఇద్దరు డ్రైవర్ల మృతి.-ఆసుపత్రి ఔషధాలను దారిమళ్లించినట్టు పోలీసుల దర్యాప్తు. జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 10: నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో మత్తు ఇంజెక్షన్ల అక్రమ విక్రయంపై వెలుగుచూసిన సంచలన కేసు కలకలం రేపుతోంది. మత్తు కోసం అనస్తీషియా ఇంజెక్షన్లు తీసుకున్న ఇద్దరు ఆటో డ్రైవర్లు కుప్పకూలి మృతిచెందడంతో, పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధానంగా ఇద్దరు వైద్యుల ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణ...