వీధి కుక్కలు వెంబడించడంతో బైకుపై నుండి పడి యువకుడు మృతి.
జనం వాయిస్, వరంగల్:
వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్చాపూర్ గ్రామంలో, హన్మకొండలో ఉద్యోగం ముంగించుకుని వస్తున్న ఎలుకుర్తి గ్రామానికి చెందిన ఆడెపు శివకుమార్(24) అనే యువకుడిని వెంబడించిన వీధి కుక్కలు. దీంతో కుక్కల నుండి తప్పించుకునేందుకు వేగంగా వాహనం నడిపి అదుపుతప్పి డ్రైనేజీలో పడి మృతి చెందిన శివకుమార్.రాష్ట్రంలో వీధి కుక్కల వల్ల రోజుకో ప్రాణం పోతున్నా, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మండిపడుతున్న స్థానికులు.