ఎల్లమ్మ గుడికి 50 వేల రూపాయలు విరాళం.
జనం వాయిస్, ముత్తారం:
ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులు నిర్మిస్తున్న ఎల్లమ్మ గుడికి నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ (సింగరేణి ఉద్యోగి) రూ.50 వేల విరాళాన్ని గురువారం గౌడ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ఆరాధ్య దైవం ఎల్లమ్మ గుడి నిర్మాణం కోసం తనవంతుగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఎల్లమ్మ గుడి నిర్మాణం లో తన వంతుగా సహాయం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఆలయ కమీటి సభ్యులు, గౌడ కులస్తులు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, కులస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.