అప్పుల భారానికి ప్రాణాలు అర్పించకండి…సమాజానికి హెచ్చరికగా మారిన విషాద ఘటన
అప్పుల భారానికి ప్రాణాలు అర్పించకండి… సమాజానికి హెచ్చరికగా మారిన విషాద ఘటన. జనం వాయిస్, వెబ్ డెస్క్:మహబూబ్ నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఒక దంపతులు ఆత్మహత్యకు యత్నించగా, ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన దంపతులు తమ చిన్న పసిబిడ్డను పొలంలో ఉన్న ఉయ్యాలలో వదిలి, సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నారు.ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. చిన్నారి మాత్రం ప్రాణాలతో...