janamvoice.com
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 12:13 pm Digital Edition : GATTU MAHESH

డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి.-జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష.

డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలి.-జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష.

మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేదించాలి.

జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది చే మాదకద్రవ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్.

జనం వాయిస్,పెద్దపల్లి, నవంబర్-18:

డ్రగ్స్ రహిత నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి వేణు, డీసీపీ కరుణాకర్ లతో కలిసి జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది చే మాదకద్రవ్యాల నిరోధన ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ మాదకద్రవ్యాలు నియంత్రణ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, డ్రగ్స్ రహిత జీవన శైలి అనుసరిస్తూ, మన చుట్టూ ఉన్న ఎవరు డ్రగ్స్ బారిన పడకుండా మన వంతు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.యువత జీవితాలను డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తుందని, సరదా కోసం కూడా ఎటువంటి చెడు అలవాట్ల వైపు దృష్టి సారించవద్దని కలెక్టర్ సూచించారు.డ్రగ్స్ అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్న వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ బి .వనజ, ఏసిపి గజి కృష్ణ ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.