janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 3:49 pm Digital Edition : JANAM VOICE

ఆచార్య జయశంకర్ కు నివాళులు అర్పించిన దుద్దిళ్ల శ్రీను బాబు.

ఆచార్య జయశంకర్ కు నివాళులు అర్పించిన దుద్దిళ్ల శ్రీను బాబు.

జనం వాయిస్, మంథని, జూన్ 21:

మంథని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సిద్ధాంతకర్త, మహనీయుడు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి వర్ధంతి కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి  నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి, సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ఆచార్య జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శ్రీను బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.