విశాఖలో భూకంపం..!ఉలిక్కిపడ్డ సాగర నగరం.
జనం వాయిస్, విశాఖ జిల్లా, జూలై 12:
సాగర నగరం ఆదివారం తెల్లవారు జామున ఒక్కసారి ఉలిక్కిపడింది, గాఢ నిద్రలో ఉన్న నగర వాసులకు ఒక్కసారిగా వారు పడుకున్న బెడ్లు ఇండ్లలోని వస్తువులు కదలడంతో ఏం జరు గుతుందో అర్థం కాలే దు, దీంతో ప్రాణ భయంతోజనాలు ఇండ్ల నుంచి రోడ్డు పైకి పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలు వణుకు పుట్టించాయి. ఇంట్లో అప్పుడప్పుడే నిద్ర నుంచి లేస్తున్న వారు కొందరు.. వాకిం గ్ కోసం బయటకు వెళ్ళిన వారు మరి కొంత మంది భయ భ్రాంతులకు గురయ్యా రు. నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ, అధికారికం గా ప్రకటించింది. ఈ తెల్లవారుజామున 5:05:46 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.. సాగర్ నగర్, తాటి చెట్లపాలెం, సీతమ్మ ధార, అప్పు ఘర్ మాధవధార, పెద వాల్తేరు, ఎంవీపి కాలనీ, ఈస్ట్ పాయిం ట్ కాలనీ, హెచ్ బి కాలనీ, సహా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. బంగాళాఖాతంలో భూకంపకేంద్రం
భూప్రకంపనలు అధికారికంగా నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ధ్రువీకరించింది. బంగాళాఖాతంలో పది కిలోమీటర్ల లోతులో సంభవించి నట్టు అధికారికంగా పేర్కొంది. కాకినాడకు తూర్పున 227 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు నిర్ధారించింది.