విశాఖ జిల్లాలో భూకంపం..
విశాఖ జిల్లాలో భూకంపం.. జనం వాయిస్, వెబ్: విశాఖ జిల్లా:నవంబర్04ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారు జామున 4:19 గంటల సమయంలో భూప్రకంప నలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా విశాఖ వాసులను భూకంపం వణికించింది. తెల్లవారు జామున విశాఖలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.భారీ శబ్దాలతో భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. విశాఖపట్టణంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్య పాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో తెల్లవారు...