(ఎడిటోరియల్)<br>ఆఫ్‌లైన్ జీవితం సాధ్యమేనా?
(ఎడిటోరియల్)ఆఫ్‌లైన్ జీవితం సాధ్యమేనా?ఇంటర్నెట్ లేకుండా ఒక రోజు – నిజంగా సాధ్యమేనా?.సౌకర్యంగా మొదలైన సాంకేతికత ఇప్పుడు అవసరంగా మారిందా?.డిజిటల్ ప్రపంచంపై పెరుగుతున్న ఆధారపడటం కొత్త ప్రశ్నలు లేవనెత్తుతోందా?.మనిషి జీవితం ఇంటర్నెట్ చుట్టూనే తిరుగుతోందా?.జనం వాయిస్, సంపాదకీయం, మే 21: ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే ప్రత్యేక అవసరం. ఇప్పుడు అది జీవనశైలిలో భాగమైపోయింది. ఉదయం కళ్లుతెరిచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన జీవితంలోని దాదాపు ప్రతి పని ఇంటర్నెట్‌తో ముడిపడి ఉంది. సమాచారం తెలుసుకోవడం, పని చేయడం, చదువు, కొనుగోళ్లు, చెల్లింపులు, వినోదం,...