రేపు తెలంగాణలోని విద్య సంస్థలు బంద్.?
జనం వాయిస్, హైదరాబాద్, జులై 09:
తెలంగాణలో విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవు దొరికే అవకాశం కనిపిస్తుంది, విద్యారంగానికి సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ వామపక్షాల విద్యార్థి సంఘాలు జులై 10న రాష్ట్ర వ్యాప్తంగా విద్య సంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ బంద్‌తో పాటు జులై 11న రెండో శనివారం, జులై 12న ఆదివారం కూడా సెలవులు ఉండటంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు విరామం లభించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థు ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.