సీఎం ఇంటి ముందు వృద్ధుడి ఆత్మహత్యాయత్నం.

సీఎం ఇంటి ముందు వృద్ధుడి ఆత్మహత్యాయత్నం.- నారావారిపల్లెలో ఉద్రిక్తత.- తిరుపతి ఆసుపత్రికి తరలింపు.- పరిస్థితి విషమం.జనం వాయిస్, నారావారిపల్లె: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఎదుట బుధవారం ఉదయం ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా రాజయ్యగారిపల్లికి చెందిన గోవిందరెడ్డి (65) తమ సమస్యలను వినిపించుకునేందుకు ఉదయమే సీఎం ఇంటికి వచ్చినట్లు సమాచారం. అయితే పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనకు లోనై ఆత్మహత్యాయత్నం చేశారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....