తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
జనం వాయిస్, పల్నాడు జిల్లా:
పల్నాడు జిల్లా చిలకలూరిపేట తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకుల ఆదేశానుసారంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి మెట్రో ఉదయం కార్యాలయంలో తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా తుర్లపాటి వెంకట నగేష్, ఉపాధ్యక్షులుగా బత్తుల విక్రమ్, ప్రధాన కార్యదర్శిగా గొట్టిపాటి సీతారామయ్య, సహాయ కార్యదర్శిగా బి. రాంబాబు నాయక్, కోశాధికారిగా సిహెచ్ హరి ప్రసాద్ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బి.శ్రీను నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం జర్నలిస్టులకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేపడతామని చెప్పారని, తిరిగి దాని ఉసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు జర్నలిస్టులకు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన అభిప్రాయ మేరకు రూ.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ జర్నలిస్టులకు వచ్చే విధంగా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఉగాది పురస్కారాలను జర్నలిస్టుల సంక్షేమ సంఘం అందించేందుకు కృషి చేస్తుందని, రానున్న రోజుల్లో మరింత బలంగా ముందుకు వెళ్లే విధంగా కృషి చేస్తామని తెలిపారు. నిరంతరం ప్రజల పక్షాన వార్తలు రాస్తూ… సేవ కార్యక్రమాలు చేసేందుకు కమిటీ తీర్మానం చేస్తుందని తెలిపారు. కమిటీ సభ్యులు క్రమశిక్షణతో ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసే విధంగా చేసుకోవాలన్నారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘనికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు పత్రికలకు సంబంధించిన పాత్రికేయులు పాల్గొన్నారు.