janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 3:02 pm Digital Edition : JANAM VOICE

చెరువు కుంటలు సైతం కబ్జా వాటిని కాపాడండి సారు.

చెరువు కుంటలు సైతం కబ్జా వాటిని కాపాడండి సారు.

మండల కేంద్రంలో కుమ్మరి కుంట విస్తీర్ణం ఎంత.

జనం వాయిస్, మహాదేవపూర్, జూలై 9:

మహాదేవపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కుమ్మరి కుంట ను అధికారులు పరిశీలించి .కబ్జా కాకుండా  రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రధానంగా కుంటల ద్వారా రైతులకు పంట పొలాలకు సకాలంలో నీరు అందించడానికి ఉపయోగపడే ఈ కుంటలను కొందరు వాటిని ఆసరా చేసుకొని కబ్జాలకు పాల్పడుతున్నారు.దాని ద్వారా రైతంగానికి చాలా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని ఉన్నత స్థాయి అధికారులు పూర్వపు ఆ కుంట ఎంత విస్తీర్ణం  ఎంత కలిగి ఉందో పూర్తిస్థాయిలో విచారణ చేసి .ఆ కుమ్మరి కుంటను కాపాడాలని ఈ ప్రాంత రైతాంగం కోరుకుంటుంది అదేవిధంగా ఎవరైతే కుంటను కబ్జా  చేశారో వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా. ఉండాలంటే హైడ్రా తరహా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప. మరోసారి ఇలాంటివి  ఎవరు కూడా. సాహసం చెయ్యరని  రైతులు వాపోతున్నారు.భవిష్యత్తులో వీటి ద్వారా తీవ్ర నష్టాలు జరగకుండా చూడాలని .ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు  తీసుకుంటే తప్ప కబ్జాలు ఆగవని పలువురు వాపోతున్నారు.