3 విడతలలో రైతు భరోసా నిధులు జమ.
– జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్.
– మార్చి 25 వరకు కొత్త పట్టాదారులు బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలి.
జనం వాయిస్, పెద్దపల్లి, మార్చి-17:
యాసంగి 2026 సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులను మూడు విడుతలలో విడుదల చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 22న సిద్దిపేట జిల్లాలో 300 కోట్లతో నిర్మించిన ఆయిల్ పామ్ నూనె ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాసంగి సీజన్ 2026 రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని, మన జిల్లాకు సంబంధించి 1,51,300 మంది రైతుల ఖాతాలలో 162 కోట్ల 52 లక్షల రూపాయలు మూడు దఫాలుగా విడుదల ఏప్రిల్ నెలాఖరు నాటికి రైతు భరోసా నిధులు జమ అవుతాయని అన్నారు. ఫిబ్రవరి 28 నాటికి జారి అయిన పట్టాదారు పాస్ పుస్తకాల కు సంబంధించిన రైతులకు రైతు భరోసా చెల్లించడం జరుగుతుందని, నూతనంగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు రైతు భరోసా నిధుల కోసం తమ బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలని, ఇతర వివరాల కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆ ప్రకటనలో
పేర్కొన్నారు.