మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం..
– డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం.
జనం వాయిస్, మహారాష్ట్ర:
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా సాంకేతిక లోపంతో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో విమానం నేలను ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, సిబ్బంది సహా మొత్తం నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత అజిత్ పవార్ (66) విమాన ప్రమాదంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానంలో ఉన్న మరో ఆరుగురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కానీ అధికారికంగా మాత్రం నలుగురే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ హఠాత్పరిణామంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.