అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.-మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు మృతి.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.-మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు మృతి జనం వాయిస్, క్రైమ్:అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. గార్ల మండల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనూర్ గ్రామ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన ఈ ఇద్దరు యువతులు రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం...