“నాన్న మాట”..భవిష్యత్తుకు భాట.
"నాన్న మాట"..భవిష్యత్తుకు భాట.చిన్నప్పుడు నాకు ప్రపంచంలో ఒకటే భయం.నాన్న దూరమైపోతాడేమో అని.మానాన్న.గోపయ్య. పేరుకే కిరాణం షాపు ఓనర్ కానీ నాకు ఆయన దేవుడు,ఫ్రెండ్,హీరో అన్నీ.ఉదయం లేస్తే అర్ధరాత్రి దాకా కష్టం.కిరాణం పెట్టడు అందులో కొంత ఇబ్బంది ఏర్పడి తర్వాత బట్టల వ్యాపారం చేశాడు.ఏదీ చేసినా ఎంత కష్ట పడినా కలిసిరాలేదు.నష్టాలు అయినా మొహంలో చిరునవ్వు చెరిగిపోలేదు.ఎప్పుడు ఒకమాట చెప్పుతుండేవారు కష్ట పడ్డవారికి సుఖం దానంతట అదే వస్తుంది అని కనీ మా నాన్న చనిపోయేవరకు కష్టపడ్డారు,నాన్న సుఖాన్ని ఎప్పుడు కోరుకోలేదు,నా పిల్లలు సుఖంగా బ్రతకాలి...