పొలం వద్ద మహిళా న్యాయవాది హత్య.
పొలం వద్ద మహిళా న్యాయవాది హత్య. - కుటుంబ కలహం ప్రాణం తీసింది. - సోదరుడే కత్తితో దాడి.జనం వాయిస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లిలో పొలం వద్ద మహిళా న్యాయవాది స్వప్న హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో స్వంత సోదరుడే ఆమెను కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న స్వప్నకు కుటుంబంలో ఆస్తి సంబంధిత వివాదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం...