సింగరేణి కార్మికుడి ఇంట్లో అగ్నిప్రమాదం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం.
సింగరేణి కార్మికుడి ఇంట్లో అగ్నిప్రమాదం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం. షార్ట్‌సర్క్యూట్ కారణమనే అనుమానం.. నిద్రలోనే అప్రమత్తమై ప్రాణాపాయం నుంచి బయటపడ్డ కార్మికుడు. జనం వాయిస్, మందమర్రి, జూలై 16: మందమర్రి ఏరియా స్టేషన్ రోడ్డులోని సింగరేణి క్వార్టర్స్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సింగరేణి కార్మికుడి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.8 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మందమర్రి ఏరియా వర్క్‌షాప్‌లో పనిచేస్తున్న సింగరేణి కార్మికుడు బిల్లా మాధవరెడ్డి రాత్రి...