కరీంనగర్ కారులో చెలరేగిన మంటలు.
జనం వాయిస్, కరీంనగర్:
హైదరాబాద్- కరీంనగర్ ప్రధాన రహదారిపై అలుగునూరు వంతెన వద్ద మారుతి 800 కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు సకాలంలో బయటకు దూకడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ సంఘటనతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది.