సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో మంటలు.
సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో మంటలు. బీబీనగర్ సమీపంలో ఘటన. చక్రం రాపిడితో చెలరేగిన మంటలు. అప్రమత్తమైన సిబ్బందితో తప్పిన ముప్పు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేవు. జనం వాయిస్,యాదాద్రి భువనగిరి,అక్టోబర్7:సిర్పూర్-కాగజ్‌నగర్ వెళ్లే రైలులో బుధవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలు ఓ బోగీ చక్రానికి బ్రేక్ లైనర్ పట్టేయడంతో ఏర్పడిన రాపిడి కారణంగా పొగలు, మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రైలు బీబీనగర్ స్టేషన్ సమీపానికి చేరుకుంటున్న...