janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 5:46 pm Digital Edition : GATTU MAHESH

మత్స్యకార కార్మికులకు చెరువు కేటాయించాలి

మత్స్యకార కార్మికులకు చెరువు కేటాయించాలి

జనం వాయిస్,మంథని, నవంబర్ 21:

గంగపుత్ర, బెస్త మత్స్యకార కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం వెంటనే చెరువు కేటాయించాలని మత్స్య కార్మికులు కోరారు.శుక్రవారం మంథని మండలం దుబ్బపల్లి గ్రామంలో మత్స్య కార్మికులు మత్స్యకార దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామంలో చేపల చెరువు నిర్మించాలని వారు కోరారు.మత్స్య కార్మికుల అభివృద్ధి కోసం సొసైటీ నిర్మాణం చేయాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో తోకల మల్లేష్, కాళ్ల లింగయ్య, ధర్మాజీ చంద్రయ్య, మేడి నరసయ్య, కూనరపు సంతోష్, మహిళ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.