janamvoice.com
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 12:00 pm Digital Edition : JANAM VOICE

వలలో చిక్కి మత్స్యకారుడి మృతి.

వలలో చిక్కి మత్స్యకారుడి మృతి.
• చలివాగులో చేపల వేటకు వెళ్లి ప్రమాదం
• తెల్లవారుజామున ఘటన.. కుటుంబంలో విషాదం

జనం వాయిస్, శాయంపేట, ఆగస్టు 10:

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతిచెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టులో చోటుచేసుకుంది.శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన భిక్షపతి (45) మత్స్యకారుడిగా జీవనం సాగిస్తున్నాడు. రోజువారీగా చేపల వేటకు వెళ్లే భిక్షపతి సోమవారం తెల్లవారుజామున చలివాగులోకి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చేపల వలలో చిక్కుకుని మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భిక్షపతి మృతితో మైలారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.