సర్పంచ్ ని సన్మానించిన మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్.
జనం వాయిస్, సుల్తానాబాద్:
సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఓజ్జా సంపత్ యాదవ్ ఇటీవల నూతన సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ తిప్పారపు కమల దయాకర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఓజ్జా సంపత్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తూ.. గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కట్టుబడి పని చేస్తానని అన్నారు.