janamvoice.com
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 11:19 am Digital Edition : GATTU MAHESH

మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మృతి.

మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మృతి.

– రాంరెడ్డి మృతి తీరని లోటు.

జనం వాయిస్, మంథని :

చంద్రుపట్ల రాంరెడ్డి.
జననం: 18/03/1947.
మరణం:03/02/2026.
స్వగ్రామం: ఖమ్మం పల్లి, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా..
కుమారులు: సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి..
పదవులు: ఖమ్మం పల్లి సర్పంచ్, ముత్తారం ఎంపీపీ, 1994-1999 వరకు టీడీపీ ఎమ్మెల్యే గా.

హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో మంథని ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ముత్తారం ఎంపీపీగా, 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంరెడ్డి ఐదేళ్లపాటు శాసనసభ్యునిగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తనవిగా భావించి పనిచేశారు. ముఖ్యంగా రైతుల కష్టాలు, గ్రామీణాభివృద్ధి అంశాలపై ఆయన చూపిన చిత్తశుద్ధి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. పదవుల కంటే ప్రజలే ముఖ్యమని నమ్మిన నేతగా, రాజకీయాలకు మానవత్వాన్ని జోడించిన వ్యక్తిగా రాంరెడ్డి గుర్తుండిపోతారు. రైతు పక్షపాతిగా, ప్రజల మనిషిగా ఆయన సంపాదించిన గౌరవం అపారమైనది. మంచితనానికి మారుపేరుగా నిలిచిన ఆయన ఇక లేరన్న నిజం మంథని ప్రజలకు తీరని లోటుగా మారింది.

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మంథని మాజీ ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు చంద్రుపట్ల రాంరెడ్డి మృతి చెందారు. మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఖమ్మం పల్లి గ్రామంలో రాం రెడ్డి జన్మించారు.1994 నుండి 1999వరకు తెలుగుదేశం పార్టీ తరపున మంథని శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు. తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు రాంరెడ్డి, 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మంథని శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దుద్దిల్ల శ్రీపాద రావుపై 21,155 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. శ్రీపాదరావు మరణానంతరం 1999లో  జరిగిన ఎన్నికల్లో దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతిలో 15,271 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 2021 ఏప్రిల్ 3న బిజేపిలో చేరాడు. రామ్ రెడ్డికి ఇద్దరు కుమారులు ఆయన పెద్ద కుమారుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాంరెడ్డి మృతి పట్ల మంథని నియోజకవర్గ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు.