లక్కీ డ్రా పేరిట మోసాలు.. సజ్జనార్ హెచ్చరిక…!
జనం వాయిస్, వెబ్ డెస్క్:
లక్కీ డ్రా పేరిట జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ‘సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కార్లు, బైక్స్, ప్లాట్స్, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న వీరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.