సీనియర్‌ సిటిజన్లకు ఉచిత బస్సు పాస్‌లు వెంటనే అమలు చేయాలి.

సీనియర్‌ సిటిజన్లకు ఉచిత బస్సు పాస్‌లు వెంటనే అమలు చేయాలి. మంత్రి పొన్నం ప్రకటనను స్వాగతిస్తున్నాం. దసరా కానుకగా 60 ఏళ్లు నిండిన వారందరికీ పాస్‌లు ఇవ్వాలి. జనం వాయిస్, ఘట్‌కేసర్, అక్టోబర్‌ 6:సీనియర్‌ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్సు పాస్‌లు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించడాన్ని డెమొక్రటిక్‌ సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ స్వాగతించింది. ఈ సౌకర్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు తోట రంగయ్య, రాష్ట్ర...