మహిళలకు ఉచితంగా పాస్ ఫోటోలు.
-ఈ అవకాశాన్ని మహిళామణులందరు వినియోగించుకోవాలి.
-ఎస్వీఆర్ ఫోటో ఫ్యాక్టరీ అధినేత డాక్టర్ ఏల్పుల వెంకటేష్.
జనం వాయిస్, మంథని:
మంథని పట్టణం గాంధీచౌక్ లోని ఎస్విఆర్ ఫోటో ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు మహిళలందరికీ 8 పాస్ పోర్టు సైజు ఫోటోలను ఉచితంగా అందించనున్నారు. తాను సంపాదించిన కొంత మొత్తాన్ని సమాజ సేవకు ఖర్చు చేస్తున్నానని అందులో భాగంగా మహిళామణులందరికీ రెండు రోజులపాటు ఉచితంగా ఎనిమిది పాస్పోర్ట్ సైజు ఫోటోలను అందిస్తున్నట్లు ఎస్వీఆర్ ఫోటో ఫ్యాక్టరీ అధినేత డాక్టర్ ఏల్పుల వెంకటేష్ తెలిపారు.ఈ రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ అవకాశాన్ని కల్పించనున్నామన్నారు. కావున మహిళమణులందరూ సద్వినియోగం చేసుకోవాలని వెంకటేష్ కోరారు.