గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం

గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శంజిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.జనం వాయిస్, పెద్దపల్లి, అక్టోబర్ 2: మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గాంధీజీ పాటించిన సత్యం, అహింస, న్యాయబద్ధత, సహనం వంటి విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు....