janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 1:01 pm Digital Edition : JANAM VOICE

తాటి చెట్టు పైనుండి పడి గీతా కార్మికుడి మృతి.

తాటి చెట్టు పైనుండి పడి గీతా కార్మికుడి మృతి.

జనం వాయిస్, మంథని, ఏప్రిల్ 29:

ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుండి పడి గీతా  కార్మికుడు మృతి చెందిన సంఘటన మంథనిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మంథని మున్సిపల్ పరిధిలోని గంగపురికి చెందిన జక్కుల దేవయ్య తన వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కగా ప్రమాదవశాత్తు పై నుండి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన దేవయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని గీతా కార్మిక సంఘాల సభ్యులు అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు.