సింగరేణి కార్మికులకు శుభవార్త.
సింగరేణి కార్మికులకు శుభవార్త.త్వరలో మెడికల్ బోర్డు ప్రారంభం.335 మందికి ఉద్యోగ పత్రాలు.సంక్షేమ చర్యలపై ప్రభుత్వం దృష్టి.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.జనం వాయిస్, హైదరాబాద్, జూన్ 12: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ కారణాలతో కొంతకాలంగా నిలిచిపోయిన సింగరేణి మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత త్వరలో యథావిధిగా ప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. మెడికల్ బోర్డును పూర్తిస్థాయి పారదర్శకత, నిష్పాక్షికతతో నిర్వహించి అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య...