కొత్తగూడెంలో ప్రభుత్వ టీచర్ హత్య..!
జనం వాయిస్, కొత్తగూడెం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం వన్ టౌన్ పరిధిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కవిత మృతి చెందింది. మృతురాలి భర్త నాగేశ్వరరావుకు తన వదినతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త నాగేశ్వరరావే కవితను హత్య చేశాడని పేర్కొన్నారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు