Date of Publish : 29 March 2026, 9:16 pmDigital Edition : JANAM VOICE
గౌడ జన హక్కుల కోసం పోరాటం చేయాలి.
గౌడ జన హక్కుల కోసం పోరాటం చేయాలి.
టాడి టాపర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్.
పెద్దపల్లి లో ఘనంగా గౌడ ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులకు సన్మానం.
జనం వాయిస్, పెద్దపల్లి:
సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు, జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఘనంగా సన్మానించారు. ఆదివారం పెద్దపల్లి పట్టణ శివారులోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో గెలుపొందిన సుమారు 206 మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు, 56 మంది జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన టాడి టాపర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ మాట్లాడుతూ గీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే దిశగా సంఘాల కతీతంగా గీత కార్మికుల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. 30 నెలల నుండి గీత కార్మికులకు తాటి చెట్టుపై నుంచి మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం అందించకపోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఎక్స్ గ్రేషియా విడుదల చేయాలని కోరారు. గౌడ సంఘంలో అనేక సంఘాలు పుట్టుకొస్తుంది అని అనడం కాదని సంఘాలు ఎక్కువగా కావడం అంటే చైతన్యం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలని అన్నారు. గౌడ సంఘంలో మొదటి నుంచి చైతన్యవంతమైన కుటుంబాల ఎక్కువగానే సాయుధ పోరాటం మొదలుకొని నేటి నక్సల్బరి వరకు, తెలంగాణ ఉద్యమంలో సైతం క్రియాశీల పాత్ర పోషించారని గుర్తు చేశారన్నారు. గౌడ జాతి బిడ్డలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదిగినప్పుడే ఇతరులకు న్యాయం చేయగలుగుతారని ఆ విధంగా ఎదగాలని కోరారు. 2029 లో నూతన అసెంబ్లీలో ఏర్పడనున్నాయని, మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తుండడంతో ఇప్పటినుండే ప్రణాళిక బద్ధంగా గౌడులు దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మాజీ ఎంపీ ధర్మ బిక్షం మాజీ ఎమ్మెల్యే దేశం చిన్న మల్లయ్య లను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సామాజిక ఉద్యమాలకు పురుడు పోసుకుంటుందని బీసీ నాయకత్వానికి గౌడ్ ప్రాతినిధ్యం వహించడమే కాకుండా పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నూతనంగా గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారి తరంగా పని చేస్తే భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మాజీ జెడ్పిటిసి గోపగాని సారయ్య గౌడ్, భూపాలపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు గౌడ్ , రాజమౌళి గౌడ్, నిర్వాహకులు జాగిరి అంజన్ కుమార్, బాలసాని ఈశ్వర్ గౌడ్, బాలసాని పరశురాములు గౌడ్, పడాల సతీష్ గౌడ్, బండారి సునీల్ గౌడ్, తాళ్లపెళ్లి మనోజ్ గౌడ్, భూషణ వేణ సురేష్ గౌడ్, బాలసాని వెంకటేశం గౌడ్ , వేగోళపు శంకర్ గౌడ్, తాళ్లపల్లి మనోజ్ గౌడ్, పడాల సతీష్ గౌడ్, బండారి సునీల్ గౌడ్, భూషణ వేణ సురేష్ గౌడ్, జక్కే విష్ణువర్ధన్ గౌడ్, దూలం సతీష్ గౌడ్, సుద్దాల సతీష్ గౌడ్, ఏడుకొండ రమేష్ గౌడ్, గుర్రం శ్రీనివాస్ గౌడ్, తోడేటి సదానందం గౌడ్, కోల నర్సా గౌడ్, వెంగలి తిరుపతి గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఆకుల శ్రీనివాస్ గౌడ్, మేడగోని శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.