అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తికి గురుజ్యోతి నేషనల్ అవార్డు.
జనం వాయిస్, ఖమ్మం, జూలై 30:
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తికి గురు జ్యోతి నేషనల్ అవార్డు లభించింది. విశాఖపట్నం కు చెందిన గ్లోబల్ ఫౌండేషన్ వారు గుగ్గిళ్ళ దివ్యమూర్తి ప్రతిభను గుర్తించి మరియు ఇప్పటివరకు 1500 ల మోటివేషన్ స్పీచ్ లు ఇచ్చినందుకు ఈ అవార్డును ఇస్తున్నట్లు ప్రకటన చేశారు.

ఈ అవార్డును దివ్యమూర్తి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల ఎమ్మార్వో పోలె కమలాకర్ చేతుల మీదుగా గురువారం నాడు అనంతగిరి ఎమ్మార్వో కార్యాలయంలో అందుకోవడం జరిగింది. తదనంతరం దివ్యమూర్తికి ఎమ్మార్వో పోలె కమలాకర్ మరియు రెవెన్యూ సిబ్బంది శాలువాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుగ్గిళ్ళ దివ్య
మూర్తి మాట్లాడుతూ ఈ అవార్డు రావడం సన్మానం జరగడం సంతోషంగా ఉందని ఇప్పటివరకు తనకు 79 అవార్డులు వచ్చాయని, 143 వేదికల మీద సన్మానం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో శ్రీధర్, అపరమేధావి అభిమానుల సంఘం అనంతగిరి మండల అధ్యక్షులు మద్దెల నాగేంద్రబాబు, ఆర్ ఐ వెంకట నగేష్, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్, ఎఫ్టిఎస్ గణేష్, అనంతగిరి జిపి ఓ నరేష్, తదితరులు పాల్గొన్నారు.
