janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 9:37 am Digital Edition : JANAM VOICE

పదవీ విరమణ చేసిన జవాన్ కు జయహో..

పదవీ విరమణ చేసిన జవాన్ కు జయహో..

జనం వాయిస్, మంచిర్యాల:

16ఏళ్లు దేశ సరిహద్దుల్లో సేవలందించి పదవీ విరమణ చేసిన హవాల్దార్ గోనె ప్రభాకర్ కు ఆదివారం జన్నారంలో ఘన స్వాగతం లభించింది. మంచిర్యాల జిల్లా రోటిగూడెంకు చెందిన ప్రభాకర్.. కశ్మీర్ వంటి కఠిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు జన్నారం ప్రధాన రహదారి నుంచి ఇంటి వరకు భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. భారత్ మాతా కీ జై నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.