రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర విమర్శలు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర విమర్శలు.- నేర చర్యలకు ముఖ్యమంత్రి బహిరంగ పిలుపు.- శాంతిభద్రతలను దెబ్బతీసే ప్రయత్నం- డీజీపీ మౌనంపై ప్రశ్నలు.జనం వాయిస్, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా పిలుపునిచ్చిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి, హోంమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే శాంతిభద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడటం అత్యంత ప్రమాదకరమని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.ఈ వ్యవహారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను...