janamvoice.com
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 4:40 pm Digital Edition : JANAM VOICE

ఓ రెడ్డి బెల్టు షాపులో యువత మత్తుకు బందీనా..?

ఓ రెడ్డి బెల్టు షాపులో యువత మత్తుకు బందీనా..?

బైక్ లు సెల్ ఫోన్లు తాకట్టు పెడుతున్నట్టు సమాచారం.

మహాదేవపూర్ మండలంలో విచ్చలవిడిగా బెల్టు షాపుల దందా.

పట్టించుకోని అధికారులు.

జనం వాయిస్, మహాదేవపూర్, జూన్ 14:

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో విచ్చలవిడి బెల్ట్ షాపులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మహాదేవపూర్ వైన్ షాప్ ప్రక్కనే ఓ రెడ్డి బెల్టు షాప్ లో  యువత మత్తుకు బానిసై విచ్చలవిడిగా అప్పుచేసి తమ సొమ్ము తాకట్టు పెట్టినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా యువత చెడిపోకుండా చూడాల్సిన ప్రభుత్వ అధికారులు కనీసం అవగాహన కల్పించకుండా నిర్లక్ష్యం ధోరణితోనే యువత విచ్చలవిడిగా మత్తుకు బానిసై బ్రాందీ షాపు పక్కనే మరో బ్రాందీ షాప్ అన్నట్టుగా రాత్రి 12 అయిన కూడా మా తలుపులు తెరుచుకుంటాయి  అన్న చందంగా యువతను ఆకర్షిస్తూ మితిమీరితే వారి సెల్ ఫోన్లు బైకులు సైతం మందు పైసలకు తాకట్టు పడ్డట్టుగా మండల కేంద్రంలో ప్రధానంగా వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో విచ్చలవిడి బెల్ట్ దందా నడిపిస్తు బ్రాండ్ షాప్ ని మించిపోయిన ఓ రెడ్డి బెల్ట్ షాప్ పై అధికారుల కన్ను పడకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది. యువత మత్తుకు బానిసై తమ దగ్గర ఏది ఉంటే అదే తాకట్టు పెట్టి మరి మద్యానికి బానిసలు అయినారని వినికిడి. చాలామంది అప్పుల పాలై ఏమి తోచని స్థితిలో మత్తుకు బందీ  అయినట్టు సమాచారం. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి  ఉంచి చర్యలు తీసుకోవాలని మహాదేవపూర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు..