janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 11:34 am Digital Edition : JANAM VOICE

ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా?

ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా?

జనం వాయిస్, వెబ్ డెస్క్, ఆగష్టు 16:

ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా?
మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఆధార్ ఆధారిత e-KYC పూర్తి చేయలేదా? అయితే వెంటనే అప్రమత్తం అవ్వండి. ఆగస్టు 16 లోపు e-KYC పూర్తి చేయకపోతే, డొమెస్టిక్ ధరలకు LPG సిలిండర్లను పొందే అర్హతను కోల్పోవచ్చు. PMUY లబ్ధిదారులు సబ్సిడీని కోల్పోతారు. ఈకేవైసీని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండా, మీ ఫోన్‌లోనే ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు. సంబంధిత గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, Aadhaar FaceRD యాప్ ఉపయోగించి ఫేస్ స్కాన్ ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో పూర్తి కాకపోతే, దగ్గర్లోని గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి. వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.