janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 12:27 pm Digital Edition : GATTU MAHESH

మేడారంలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసిన హీరోయిన్ టీనా శ్రావ్య.

మేడారంలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసిన హీరోయిన్ టీనా శ్రావ్య.

జనం వాయిస్, హైదరాబాద్:

పెంపుడు కుక్కకు తులాభారం వేయడం ఏంటని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పలువురు నెటిజెన్లు.విషయం వివాదం కావడంతో శ్రావ్య అలెర్ట్ అయ్యారు. తన ఉద్దేశ్యం అది కాదంటూ సెల్ఫ్ వీడియో ఒకటి విడుదల చేశారు.క్షమాపణలు కోరుతూ వివాదానికి ముగింపు పలకాలని కోరారు.మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసిన ఘటనపై టాలీవుడ్ నటి టీనా శ్రావ్య బహిరంగ క్షమాపణలు చెప్పారు.తన కుక్క ఆరోగ్యం కోసమే మొక్కు తీర్చుకున్నానని,భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని,ఇంతటితో ఈ వివాదాన్ని ముగించాలని ప్రాధేయపూర్వకంగా ఆమె వీడియో ద్వారా కోరారు.