janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 11:54 am Digital Edition : JANAM VOICE

సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. కారులో సజీవదహనమైన వైద్యుడు.

సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. కారులో సజీవదహనమైన వైద్యుడు.

  • డివైడర్‌ను ఢీకొట్టి కారులో చెలరేగిన మంటలు.
  • ఖమ్మం న్యూరో సర్జన్ కాసకుర్తి జగదీశ్ సజీవదహనం.
  • తలుపులు లాక్ అవ్వడంతో బయటకు రాలేకపోయిన వైద్యుడు.

జనం వాయిస్, సూర్యాపేట, సెప్టెంబర్ 20:

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, అందులో ప్రయాణిస్తున్న ప్రముఖ న్యూరో సర్జన్ సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన పిల్లలమర్రి శివారులోని హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని మమత ఆసుప‌త్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ కాసకుర్తి జగదీశ్, తన కారులో ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పిల్లలమర్రి వద్దకు రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు కారు మొత్తం వ్యాపించడంతో డోర్లు లాక్ అయ్యాయి. దీంతో డాక్టర్ జగదీశ్ బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. అగ్నిగోళంలా మారిన కారులో ఆయన మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. రహదారిపై వెళ్తున్న ఇతర వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.